తన మొదటి సినిమాతోనే సత్తా చాటిన దర్శకుల్లో కోలీవుడ్ దర్శకుడు అట్లీ కూడా ఒకరు. సాఫ్ట్ ప్రేమ కథలను మాత్రమే కాకుండా సాలిడ్ అండ్ స్టైలిష్ యాక్షన్ డ్రామాలను కూడా తెరకెక్కించడంలో అట్లీ సత్తా చాటాడు. అయితే ఇప్పుడు వరకు అట్లీ తెరకెక్కించిన సినిమాల విషయంలో చాలా ట్రోల్స్ ఉంటాయి. ఎక్కువ తన సందేశాత్మక సినిమాలు ఆల్రెడీ చూసేసినట్టే అంటే శంకర్ తరహా సోషల్ మెసేజ్ యాక్షన్ డ్రామా తరహాలో ఉంటాయి.
కాపీ సినిమాలు అనే ట్రోల్స్ చాలానే ఉన్నాయి. మరి వీటిపై అట్లీ సమాధానం ఇచ్చాడు. ఏవైతే కాపీ అని అంటున్నారో అవన్నీ తన నిజ జీవితంలో జరిగాయని తన సినిమాల్లో కొన్ని పాత్రలు కూడా ఇతరుల ప్రేరణ ఆధారంగా తెరక్కించినవి అని చెబుతున్నాడు. ఇక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ హంగులతో సన్ పిక్చర్స్ వారు తెరకెక్కిస్తున్నారు.