నిజంగానే వర్త్.. అంచనాలు పెంచే విధంగా ‘ది రాజా సాబ్’ ప్రీటీజర్

నిజంగానే వర్త్.. అంచనాలు పెంచే విధంగా ‘ది రాజా సాబ్’ ప్రీటీజర్

Published on Jun 15, 2025 1:52 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రం “ది రాజా సాబ్”. అయితే ఈ సినిమా కోసం ఎప్పుడు నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న నిరీక్షణకు మేకర్స్ ఇప్పుడు ప్రీటీజర్ తో గట్టి సమాధానమే ఇచ్చారని చెప్పవచ్చు. నిజానికి ప్రభాస్ కెరీర్ లో ఇప్పుడు చేస్తున్న సినిమాలలో తక్కువ హైప్ తో మొదలైన సినిమా ఇదే.

అయినప్పటికీ మేకర్స్ అక్కడ నుంచి సినిమాని గట్టి ట్రీట్ ఇచ్చేలా మార్చినట్టు అనిపిస్తున్నారు. ఇక ఈ ప్రీటీజర్ లో చూపించిన విజువల్స్ అదిరాయని చెప్పాలి. లోడింగ్ నుంచి స్టార్ట్ అయ్యి సుప్రీత్ పాత్ర నుంచి ముగ్గురు హీరోయిన్స్ రిద్ధి కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లపై విజువల్స్ వారిలో నిధికి గాయం అలాగే ఈ కథ అంతా ఒకే ఇంట్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

ఇంకోపక్క లోడింగ్ పేజ్ లో బయట విజువల్స్ ప్రభాస్ కళ్ళు, ఒక కార్, ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విజువల్స్ ని నింపేసి మరింత ఆసక్తి రేపారు. మరి ఇదంతా చూస్తుంటే ఇన్నాళ్లు ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూసిన ఎదురు చూపులుకి వర్త్ అనిపించే సాలిడ్ కంటెంట్ తో మేకర్స్ రాబోతున్నారని చెప్పవచ్చు. ఇక రేపు రానున్న ఫుల్ టీజర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. అలాగే ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ ఖర్చుతో తెరకెక్కిస్తుండగా ఈ డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు