‘మెగాస్టార్ – అనిల్ రావిపూడి’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

‘మెగాస్టార్ – అనిల్ రావిపూడి’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

Published on Jun 15, 2025 12:06 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఐతే, ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ ను వేస్తున్నారు. ఈ సెట్ లో మెగాస్టార్ తో పాటు నయనతార మరియు మిగిలిన కీలక నటినటులు పాల్గొంటారట. ఈ క్లైమాక్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవుతుందట. అన్నట్టు వచ్చే వారం జరగనున్న షెడ్యూల్ లో మెగాస్టార్ – నయనతార ల పై ఫ్యామిలీ సీన్స్ ను షూట్ చేస్తున్నారట. ఈ సీన్స్ లో మెగాస్టార్ – నయనతార మధ్య కామెడీ ఎపిసోడ్ చాలా బాగుంటుందని, అలాగే సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా హైలైట్ అవుతుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు నచ్చిందని చిరు ఆల్ రెడీ చెప్పారు. అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్‌ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు