రాంబాబు సినిమా యు.ఎస్ ప్రింట్స్ స్టేటస్

రాంబాబు సినిమా యు.ఎస్ ప్రింట్స్ స్టేటస్

Published on Oct 16, 2012 7:45 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సారి ఓ పవర్ఫుల్ టీవీ జర్నలిస్ట్ గా నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం భారీ ఎత్తున ఈ గురువారం విడుదల కానుంది. ఓవర్సీస్ కి సంబందించిన ఈ చిత్ర ప్రింట్స్ ఇప్పటికే బయలు దేరాయి. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ఒక్క యు.ఎస్.ఎ లోనే 17 సాధారణ ప్రింట్స్ మరియు 55 డిజిటల్ ప్రింట్స్ తో విడుదలవుతోంది. ఇప్పటికే డిజిటల్ ప్రింట్స్ బయలుదేరి పోగా, సాధారణ ప్రింట్స్ ఈ రోజు రాత్రి 9:15 నిమిషాలకు వెళ్లబోయే ఫ్లైట్లో వెళ్లనున్నాయి. ఇంతక ముందు చెప్పిన షెడ్యూల్స్ చెప్పిన ప్రకారమే యు.ఎస్ లో ప్రీమియర్ షోలు వేస్తారు మరియు సినీ అభిమానులు ఆ షోలకి సంబందించిన టైమింగ్స్ ని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ని అడిగి తెలుసుకోమని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తెలియజేసింది. ఈ సినిమాలో జర్నలిస్ట్ అయిన పవన్ కి కెమెరామెన్ గా తమన్నా నటించింది. డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు