యు.ఎస్ లో రికార్డ్ సృష్టించిన రాంబాబు

యు.ఎస్ లో రికార్డ్ సృష్టించిన రాంబాబు

Published on Oct 19, 2012 9:20 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా యు.ఎస్ లో జరిగిన ప్రీమియర్ షోల కలెక్షన్స్ తో రికార్డ్ నెలకొల్పింది. సుమారుగా 75-80 లక్షల షేర్ సంపాదించింది మరియు ఇలాంటి కలెక్షన్స్ ఇప్పటివరకూ ఏ సినిమాకి రాలేదు. ఆంధ్ర ప్రదేశ్లో కూడా బెనిఫిట్ షో కి మంచి కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ తో అదిరిపోయే ఓపెనింగ్స్ తో నిన్న సినిమా విడుదలైంది మరియు దసరా సెలవులు కూడా కలిసి వచ్చాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన మరియు అతని స్టార్ ఇమేజ్ ఈ చిత్ర విజయానికి బాగా సాయపడ్డాయి. పవన సరసన తమన్నా కథానాయికగా నటించారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

తాజా వార్తలు