పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ అత్తారింటికి దారేది’ సినిమా నైజాం ఏరియాలోని ల్యాండ్ మార్క్ ను క్రాస్ చేసింది. ఈ రోజు అనగా 15 అక్టోబర్ కి ఈ సినిమా 20కోట్ల మార్క్ ని దాటింది. ఇక్కడ ఇప్పటి వరకు ఈ మార్క్ ని దాటినా రెండవ సినిమా ఇది. మొదటి సినిమా ‘మగధీర’. ఇప్పటికి ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. మొత్తంగా ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమా పైరసీ బయటకు రావడంతో ఈ సినిమా నిర్వాహకులకు పెద్ద దెబ్బ అని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని వసూలు చేస్తోంది.
‘అత్తారింటికి దారేది’ సినిమా అందరి అంచనాలను తారుమారు చేసింది. ఈ సినిమా అందరికి ఒక చక్కని వెంచర్ గా మారింది. పవన్ కళ్యాణ్, సమంత నటించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నదియ ‘అత్తగారు’ గా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.