‘ఆర్ఆర్ఆర్’ సెట్లో పవన్ ప్రత్యక్షం

‘ఆర్ఆర్ఆర్’ సెట్లో పవన్ ప్రత్యక్షం

Published on Feb 20, 2021 1:10 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది. అక్కడే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కూడ జరుగుతోంది. ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సంగతి తెలుసుకున్న పవన్ షూట్ బ్రేక్లో నేరుగా ‘ఆర్ఆర్ఆర్’ సెట్లోకి వెళ్లి రాజమౌళి, ఎన్టీఆర్ ఇద్దరినీ కలిశారట. క్లైమాక్స్ చిత్రీకరణ చేస్తున్న సెట్ ను పరిశీలించారట. రాజామౌళి దగ్గరుండి పవన్ కు షూటింగ్ విశేషాలను, రషెస్ చూపించినట్టు తెలుస్తోంది.

ఇంకొన్ని రోజులు పవన్ షూటింగ్ అక్కడే ఉండనుంది. ప్రస్తుతం ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం:12గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతోపాటే క్రిష్ సినిమా చిత్రీకరణలో కూడ పాల్గొంటారు పవన్. ప్రజెంట్ కొత్త షెడ్యూల్ కోసం 17వ శతాబ్దం నాటి ఛార్మినార్ సెట్ రొపొందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు