పవన్ ఈ సినిమాలో జీవించారు – తమన్నా

పవన్ ఈ సినిమాలో జీవించారు – తమన్నా

Published on Oct 22, 2012 9:00 PM IST


కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో గంగ పాత్రలో నటించిన తమన్నా మొదటిసారి పవన్ కళ్యాణ్ తో మొదటిసారి నటించడం పట్ల సంతోషంగా ఉంది. ఆమె పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. పవన్ ఈ సినిమాలో నటించలేదని జీవించారని, ఆయనలో మంచి హ్యూమర్ ఉందని, ఆయన సింప్లిసిటీ తనకెంతో నచ్చాయని అంటోంది. పవన్ నటన కంటే ఆయన వ్యక్తిత్వం నచ్చి అభిమానులైన వారే ఎక్కువ ఉన్నారని అంటుంది. పవన్ ఈ సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి చేసారని చెప్తోంది. పవన్, పూరి ఈ టీం అందరితో కలిసి పనిచేయడం చాల సంతోషంగా తనకు సంతోషంగా ఉందట.

తాజా వార్తలు