సెన్స్ బుల్ డైరెక్టర్ క్రిష్ కి మణికర్ణిక, ఎన్టీఆర్ బయోపిక్ ప్లాప్ లతో పాటు, ప్రస్తుతం క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పోస్ట్ ఫోన్ తో అసలు క్రిష్ కి టైమ్ కలిసి రావడం లేదు. నిజానికి పవన్ సినిమా అనగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి బాగా ఇబ్బందులు కలుగజేసింది. వీటికి తోడు కరోనా వచ్చి సినిమా కూడా పోస్ట్ ఫోన్ అయిపోయింది. ఇది అందరి సమస్యే.
అయితే కరోనా కారణంగా ‘పవన్ – క్రిష్’ సినిమాని ఈ ఏడాది మొత్తం పోస్ట్ ఫోన్ చేయనున్నారు. పైగా వచ్చే ఏడాది కూడా పవన్ ముందుగా వకీల్ సాబ్ కి డేట్స్ ఇస్తాడు. ఆ సినిమా ఫినిష్ చేసి.. అప్పుడు క్రిష్ సినిమా మీదకు వస్తాడు. ఆందుకే ప్రస్తుతం క్రిష్ ఒక సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక పవన్ తో చేస్తోన్న చిత్రంలో పవన్ సరసన హీరోయిన్ గా జాక్వెలిన్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారట. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. భారీ సెట్లలో భారీ స్థాయిలో ఈ సినిమాని క్రిష్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ భారి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.