పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో సినిమాలు చేస్తున్నారు. కాగా వేణు శ్రీరామ్ సినిమా వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ నవంబర్ నుండి షూట్ కి రెడీ కాబోతున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి షూట్ చేయనున్నారట. ఈ షూట్ తో సినిమా పుర్తవుతుందని.. అన్ని కుదిరితే ఆ వెంటనే రిలీజ్ కూడా ప్లాన్ చేస్తారట.
అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా తగ్గేవరకూ సినిమాల షూటింగ్ కి దూరంగా ఉండటమే మంచిదని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం మిగిలిన హీరోలు షూట్ కి రెడీ అవుతుండటంతో.. పవన్ వకీల్ సాబ్ బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట.
అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తోన్న సినిమాకి మాత్రం పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ ఇవ్వబోతున్నారని.. ఈ ఏడాది చివరి వరకూ తన పార్ట్ కు సంబంధించి ఎలాంటి షూట్ ను ప్లాన్ చెయ్యొద్దు అని ఇప్పటికే పవన్ కళ్యాణ్, క్రిష్ కి చెప్పినట్లు తెలుస్తోంది.