గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
కానీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పూర్తిచేసిన పవన్, ఈ ప్రాజెక్ట్‌కి కూడా డేట్స్ కేటాయించనున్నాడాని తెలుస్తోంది. ఇక హీరోలను స్టైలిష్‌గా చూపించడంలో స్పెషలిస్ట్ అయిన సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పట్టాలెక్కిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
మరి ఓజీ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న పవన్, సురేందర్ రెడ్డితో సినిమా చేస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.