యూరప్‌లో బిజీ బిజీగా ఉన్న ‘సూర్య46’

Suriya46

తమిళ స్టార్ హీరో సూర్య తొలిసారి స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు. సూర్య46 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూరోపియన్ దేశంలోని బెలారస్‌లో అందమైన లోకేషన్స్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సూర్యపై ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఒక పాటను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, యువ నటి భవానీ శ్రీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. జి.వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

Exit mobile version