జటాధర నుంచి మరో ట్రీట్ రెడీ.. ఈసారి బాక్సులు బద్దలే..!

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘జటాధర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మిస్టిక్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీ పోస్టర్స్, సాంగ్ ఇప్పటికే మంచి రెస్పా్న్స్ తెచ్చుకున్నాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమా నుండి మరో ట్రీట్ రెడీ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీలోని రెండో సింగిల్ సాంగ్ ‘పల్లో లట్కె’ను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సాంగ్‌లో సుధీర్ బాబు, శ్రేయా శర్మ డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ డెబ్యూ చేస్తోంది. ఇక ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘల్, నిఖిల్ నంద ప్రొడ్యూస్ చేస్తుండగా నవంబర్ 7న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version