మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. అయితే, అక్టోబర్ 9 నుంచి ఈ చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జరగనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
పూణెలో జరగనున్న ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌పై ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేయనున్నారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మెలోడీ ట్యూన్స్ కంపోజ్ చేశాడని.. ఇక ఈ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయి, ఫస్ట్ హాఫ్ ఎడిట్ కూడా లాక్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ హాట్ టాపిక్‌గా మారింది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్.రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రాన్ని 2026 మార్చి 27న, రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.