బుక్ మై షోలో కాంతార సెన్సేషన్..!

Kantara-Chapter-1

కన్నడలో తెరకకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. హొంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు రాబడుతోంది.

ఇక ఈ సినిమా ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో కూడా తనదైన సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమా కోసం బుక్ మై షోలో ఏకంగా 7.5 మిలియన్‌కు పైగా టికెట్ బుకింగ్స్ జరిగినట్లు ఆ సంస్థ వెల్లడిచింది.

ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రం మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version