వాట్సాప్‌కు టఫ్ కాంపిటీషన్: కోటి డౌన్‌లోడ్‌లు, ప్లే స్టోర్ 4.8 రేటింగ్‌తో దూసుకెళ్తున్న జోహో ‘అరట్టై’

Arattai-App

జోహో రూపొందించిన స్వదేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ గూగుల్ ప్లే స్టోర్‌లో 1 కోటి డౌన్‌లోడ్‌లను దాటింది. కొద్ది రోజుల్లోనే 75 లక్షల నుండి కోటి మార్క్‌కి చేరింది. ప్రస్తుతం ఇది ప్లే స్టోర్‌లో టాప్ ఫ్రీ యాప్‌ల జాబితాలో 4.8 రేటింగ్‌తో ముందంజలో ఉంది. ఆపిల్ యాప్ స్టోర్‌లో కూడా సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో నంబర్ 1 వద్ద నిలిచింది.

‘అరట్టై’ అంటే తమిళంలో సరదా మాటలు, మామూలు కబుర్లు అనే అర్థం. పేరు లాగే, యాప్ కూడా సింపుల్‌గా, క్లియర్ ఇంటర్‌ఫేస్‌తో, అవసరమైన అన్ని ఫీచర్లతో అందుబాటులో ఉంది. నెమ్మదినెట్‌లో కూడా పనిచేసేలా దాన్ని తయారు చేశారు. గోప్యతపై దృష్టి పెంచుతూ, చాట్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను త్వరలో అందిస్తామని జోహో సహవ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు చెప్పారు.

అరట్టైలో ఏమేమి ఉన్నాయి?

మెసేజ్‌లు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్

గ్రూప్ మీటింగ్‌లు

స్టోరీస్, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేయడం

ముఖ్యమైన విషయాలు సేవ్ చేసుకునేందుకు “పాకెట్స్” అనే ప్రత్యేక ఫీచర్

సింపుల్, క్లీన్గా కనిపించే యూజర్ ఇంటర్‌ఫేస్

తక్కువ ఇంటర్నెట్ స్పీడ్‌లో కూడా సాఫీగా పని చేయడం

చాట్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ త్వరలో అందుబాటులోకి

ఇది ఎందుకు స్పెషల్?

స్వదేశీ ప్రత్యామ్నాయం: మన దేశంలోనే తయారైన, గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే యాప్‌గా అరట్టైకు ఆదరణ పెరుగుతోంది.

రెండు ప్లాట్‌ఫామ్‌లలో టాప్ ర్యాంక్: ఆండ్రాయిడ్, ఐఫోన్ యాప్ స్టోర్‌లలోనూ టాప్‌లో ఉండటం, వినియోగదారుల నమ్మకం పెరిగిందని చూపుతోంది.

ఫీచర్ల వేగం: కీలక ఫీచర్లు ఇప్పటికే ఉండగా, భద్రత కోసం ఎన్‌క్రిప్షన్ కూడా రానుండటం ప్లస్ పాయింట్.
అరట్టై ఇక నుంచి ఏ అప్‌డేట్‌లు, కొత్త ఫీచర్లు తీసుకొస్తుందో చూడాలి. వినియోగదారులు ప్రత్యేకంగా చాట్ ఎన్‌క్రిప్షన్ రోలౌట్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

Exit mobile version