వారికి మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

వారికి మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Published on Jul 24, 2025 10:00 PM IST

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘హరిహర వీరమల్లు’ నేడు వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు.

ఈ సక్సెస్ మీట్‌లో పవన్ తనదైన స్వాగ్‌లో స్పీచ్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతో కష్టపడింది.. వారి కష్టానికి తగ్గ ఫలితం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ రూపంలో లభించింది. సక్సెస్ కంటే కూడా తనకు సినిమా జనాల్లోకి వెళ్లడం తనకు విజయం అని ఆయన అన్నాడు. మన చరిత్రను కొందరు చరిత్రకారులు తప్పుగా చూపెట్టారని.. అందుకే మొఘల్స్‌కు ఇంతటి మంచితనం ఏర్పడిందని.. కానీ వారు చేసిన అకృత్యాలు మనకు చెప్పడంలో చరిత్రకారులు ఎందుకో సందేహించారని ఆయన అన్నారు.

ఇక తన సినిమాలను బ్యాన్ చేస్తామని.. నెగిటివ్ ట్రోల్స్ చేస్తామని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేశారని.. ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూస్తేనే ఇక్కడివరకు వచ్చానని పవన్ నెగిటివ్ ట్రోలర్స్‌కు రిప్లై ఇచ్చాడు. వారికి నచ్చినట్లుగా చేసుకోమని ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు