అన్నయ్యకు ప్రేమతో..పవన్ కళ్యాణ్.!

అన్నయ్యకు ప్రేమతో..పవన్ కళ్యాణ్.!

Published on Aug 22, 2020 3:29 PM IST

ఈరోజు టాలీవుడ్ లెజెండ్ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మన టాలీవుడ్ నుంచి ఎందరో నటులు నిర్మాతలు దర్శకులు మొత్తం అనేక మంది తమ శుభాకాంక్షలను అందజేశారు. కానీ ఎంత మంది చిరుకు శుభాకాంక్షలు తెలిపినా ఒక్కరి నుంచి పోస్ట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు. అలా ఎదురు చూస్తున్న తరుణంలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ తన అన్నయ్య పై ఉన్న ప్రేమను మరోసారి అక్షరాల్లో చూపించారు. తన ట్విట్టర్ ఖాతా నుంచి కాదు కానీ జనసేన పార్టీ తరపు నుంచి ప్రెస్ నోట్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

“అన్నయ్య చిరంజీవి నాకు స్ఫూర్తి ప్రదాత. జన్మనిచ్చిన తల్లిదండ్రులు లను ఎంతలా ఆరాధిస్తానో, పూజ్యులైన అన్నయ్యను కూడా అంతే ప్రేమిస్తానని అన్నయ్య ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఆవిర్భవించారని, ఎందరికో స్ఫూర్తినిచ్చి ఆపన్నులకు అండగా ఉన్న మీలాంటి కృషి వలునికి తమ్ముడుగా పుట్టడం తన అదృష్టం” అని మీరు చిరాయువుతో సుఖ శాంతులను ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ అన్నయ్యకు ప్రేమ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పవన్ తెలిపారు. దీనితో మెగా ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు