పవన్ నెక్స్ట్ చిత్రానికి భారీ అడ్వాన్స్..?

పవన్ నెక్స్ట్ చిత్రానికి భారీ అడ్వాన్స్..?

Published on Oct 29, 2025 8:06 AM IST

Pawan-Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఓజీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దీంతో పవన్ ఫ్యాన్స్‌లో ధీమా నెలకొంది. తమ అభిమాన హీరో నుంచి రాబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని వారు ఆశిస్తున్నారు

ఇక ఆ సినిమా తర్వాత పవన్ సినిమాలకు దూరం అవుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఇటీవల పవన్ మరో సినిమా కోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న KVN ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్‌కు రూ.20 కోట్ల భారీ అడ్వాన్స్‌ చెల్లించినట్లు సమాచారం.

పవన్ ఈ బ్యానర్‌లో సినిమా చేయడానికి అంగీకరించారని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు