మెగా ఫ్యామిలీలో కలహాలు అంటూ వార్తలు సృష్టిస్తున్న వారికి మెగాస్టార్ చిరంజీవి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మాస్ మసాల యాక్షన్ ఎంటర్టైనర్ ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక నిన్న జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగేంద్ర బాబు విచ్చేసి తమ మధ్య కలహాలు లేవంటూ స్పష్టం చేసారు. చిరంజీవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాకు కొడుకు లాంటి వాడు. మా అబ్బాయి చరణ్ తో మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి అరేయ్ కళ్యాణ్ అని సంభోదిస్తుంటాను. మా మధ్య సంభందం అంత గట్టిది. ఇటీవల జరిగిన ‘రచ్చ’ ఆడియో వేడుక జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ హైదరాబాదులోనే ఉంది వేడుకకు రాలేదంటూ కొందరు విష ప్రచారం చేసారు. పవన్ ఆ సమయంలో విదేశాల్లో ఉన్నాడనే దానికి మా దగ్గర పూర్తి సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. వారందరికీ ఇదే వార్నింగ్ ‘మాట తప్పడం మెగా కుటుంబంలోనే లేదు’ అని అన్నారు. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ రచ్చ చేస్తుందని ఆశీర్వదించారు.