సోమవారం హైదరాబాదుకు తిరిగిరానున్న పవన్ కళ్యాణ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని సోమవారం రోజు హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే యూరప్ నుండి యూనిట్ సభ్యులు హైదరబాద్ చేరుకోగా, శృతి హాసన్ ముంబై చేరుకున్నారు. ‘దిల్ సే’ పాట చిత్రీకరణతో ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం రేపు అన్ని హంగులు పూర్తి చేసుకుని సెన్సార్ సభ్యుల ముందుకు వెళ్లనుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ బాబు నిర్మించారు. అభిమానులకు ఆకట్టుకునేలా తీర్చిదిద్ధినల్టు యూనిట్ వర్గాలు చెబుతున్నారు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే మార్కెట్లో సంచలనం సృష్టిస్తుంది.

Exit mobile version