ట్విట్టర్ ను షేక్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్.!

ట్విట్టర్ ను షేక్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్.!

Published on Aug 16, 2020 3:58 PM IST

ఇప్పుడు మన టాలీవుడ్ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా ట్రెండ్స్ అంతా ఒక రేంజ్ లో నడుస్తున్నాయి. అలా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజుకు ప్లాన్ చేసిన కామన్ డీపీ విడుదల చేసిన ట్రెండ్ తో భారీ రికార్డులు నమోదు చేస్తున్నారు.

వరల్డ్ రికార్డు ఏమో కానీ మొదటి 1 మిలియన్ నుంచి 50 మిలియన్ ట్వీట్స్ వరకు ఫాస్టెస్ట్ రికార్డులు నమోదు చేసి ట్విట్టర్ ను షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం 50 మిలియన్ ట్వీట్స్ క్రాస్ చేసిన వారు 6 గంటలోపు ఎక్కడ ఆగుతారో చూడాలి మరి.

అలాగే ఈ ట్రెండ్ కే ఇలా ప్లాన్ చేస్తే మరి వచ్చే సెప్టెంబర్ 2 న పవన్ పుట్టినరోజుకు ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉండగా పవన్ పుట్టినరోజున వకీల్ సాబ్ యూనిట్ నుంచి స్పెషల్ టీజర్ తో పాటుగా మరో పోస్టర్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు