డైరెక్టర్ క్రిష్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సంధర్భంగా ఆయనకు ఇండస్ట్రీ నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. పవన్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో ఉన్నారు. క్రిష్ ను నేరుగా లొకేషన్లోకే ఇన్వైట్ చేసిన పవన్ అక్కడే పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. దీంతో క్రిష్ పుట్టినరోజు స్పెషల్ అయింది. అంతకుముందు ఉదయమే క్రిష్ కు ప్రత్యేకమైన ఫ్లవర్ బొకె పంపి శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాత ఏఎం రత్నం సైతం క్రిష్ కు నేరుగా శుభాకాంక్షలు చెప్పడానికి హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ సినిమాను ముగించే పనిలో ఉన్న క్రిష్ వీలైనంత త్వరగా పవన్ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టాలని చూస్తున్నారు. లాక్ డౌన్ ముందు కొద్దిగా షూటింగ్ జరుపుకున్న వీరి చిత్రం లాక్ డౌన్ ముగిశాక తిరిగి స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఈలోపు పవన్ మలయాళం రీమేక్ కు సైన్ చేయడంతో క్రిష్ సినిమా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే క్రిష్ పవన్ వారం కాల్ షీట్ ఇచ్చినా గ్రాఫిక్ కంటెంట్ ఎక్కువగా ఉండే సన్నివేశాలను చిత్రీకరించి పవన్ ఖాళీ అయ్యే వరకు సీజీ వర్క్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.