పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో విశ్రాంతి గురించి అసలు ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ జెనీవాకి 250కి.మీ దూరంలో హోటల్ కి చేరుకున్నారు అని చెప్పాము. తాజా సమాచారం ప్రకారం ఇక్కడ చిత్రీకరణ మొదలు పెట్ట్టినట్టు తెలుస్తుంది. నిన్న మొదలయిన ఈ పాట చిత్రీకరణ మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. పవన్ అందరి డాన్సర్ల స్టెప్ లను సాధన చెయ్యమని చెప్పారు ఈ షెడ్యూల్ లో ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యడానికి పవన్ ఇష్టపడట్లేదు పాట చిత్రీకరణ మొదలు పెట్టేసారు. శ్రుతి హసన్ కూడా ఈ పాట చిత్రీకరణలో పాల్గొంటుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు.