మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్‌కు అన్నీ లాక్..!

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఓజి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, నేటికి(ఆగస్టు 25) ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వర్క్ పూర్తయ్యిందని.. ఇక ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని మేకర్స్ తెలిపారు.

మరో నెల రోజుల్లో ఓజి ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుందని.. ఈ తుఫాను బాక్సాఫీస్ రికార్డులను తుడిచి పెట్టడం ఖాయమని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్‌ను ఆగస్టు 27న ఉదయం 10.18 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version