ఫిల్మ్ నగర్ లోని కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తాము తీసుకున్న రెమ్యునరేషన్ లోని కొంత మొత్తాన్ని తిరిగి నిర్మాత బివిఎస్ఎస్ ప్రసాద్ కి ఇచ్చేసారు. పైరసీ సమస్య మరియు ఉన్న పలంగా సినిమాని రిలీజ్ చేయాల్సి రావడం వల్ల ప్రొడక్షన్ హౌస్ మనీ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే వాళ్ళిద్దరూ నిర్మాతకి ఇలా సాయం చేసారు.
ఒక స్టార్ హీరో, టాలెంటెడ్ డైరెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చెప్పుకోదగిన విషయం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ శుక్రవారం అనగా 27వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో నదియా పవన్ కళ్యాణ్ కి అత్తగా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరాని, పోసాని కృష్ణ మురళి, అలీ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.