పంచంలో అతిపెద్ద సినిమా పురస్కారంగా భావించే ఆస్కార్ వేడుక అమెరికా వేదికగా ఘనంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఈ ఆస్కార్ అవార్డ్స్ నందు ఓ సంచలనం నమోదైంది. చరిత్రలో మొదటిసారి ఆంగ్లేతర సినిమా మెయిన్ కేటగిరిలో బెస్ట్ మూవీ అవార్డ్ అందుకుంది. దక్షిణ కొరియాకు చెందిన పారసైట్ మూవీ జనరల్ కేటగిరీలో బెస్ట్ పిక్చర్ అవార్డు అందుకుంది. ఇప్పటివరకు ఇంగ్లీష్ మూవీస్ మాత్రమే మెయిన్ కేటగిరిలో బెస్ట్ పిక్చర్ అవార్డ్స్ అందుకున్నాయి. మొదటిసారి ఓ కొరియన్ మూవీ ఫారిన్ కేటగిరిలో కాకుండా మెయిన్ కేటగిరిలో అవార్డు గెలుపొందింది.
కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు బోన్గ్ జోన్ హో తెరకెక్కించారు. విశేషం ఏమిటంటే ఆయన కూడా బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో అవార్డ్ అందుకున్నారు. ఇక అందరూ ఊహించినట్లే జోకర్ సినిమాలో హీరోగా నటించిన జాక్విన్ ఫీనిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోగా, జీనీ జెల్ వెగ్గర్ బెస్ట్ యాక్ట్రెస్ గా జూడీ చిత్రానికి అవార్డ్ గెలుపొందారు.