స్టంట్‌మ్యాన్ మృతిపై దర్శకుడు పా రంజిత్ వివరణ

స్టంట్‌మ్యాన్ మృతిపై దర్శకుడు పా రంజిత్ వివరణ

Published on Jul 16, 2025 1:00 AM IST

తమిళ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వేట్టువం’ షూటింగ్‌లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణలో స్టంట్‌మ్యాన్ రాజు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఇక ఈ మరణంతో చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. అయితే, ఈ ఘటనపై దర్శకుడు పా రంజిత్ స్పందించాడు.

ఈ చిత్ర షూటింగ్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుని.. ఏ సన్నివేశం ఎలా తీయాలో స్పష్టంగా ఉన్నామని.. అంతా మంచి జరగాలని ప్రార్ధించి షూటింగ్ స్టార్ట్ చేశామని.. అయితే, అనుకోనూ విధంగా మోహన్ రాజు మృతి చెందడం అందరినీ షాక్‌కు గురిచేసిందని పా రంజిత్ పేర్కొన్నాడు.

ఒక అసమాన ప్రతిభావంతుడైన వ్యక్తని మేం కోల్పోయాం. ఆయన తన కుటుంబంతో పాటు సహచరలు, దర్శకులు గర్వపడేలా పని చేసేవారు. ఆయన పట్ల మా ప్రేమ, అభిమానం ఎప్పటికీ కొనసాగుతుందని పా రంజిత్ విచారం వ్యక్తం చేశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు