స్టార్ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి కంటెంట్‌తో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ చిత్రంపై మంచి ఫీల్ తీసుకొచ్చాయి.
అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘నదివే’ అనే పాటను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా ఈ ‘నదివే’ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేసి చక్కటి మెలోడీగా పాడారు. ప్రోమోలో రష్మక మందన్న, దీక్షిత్ శెట్టి మంచి డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు.
ఇక ఈ సాంగ్‌ను జూలై 16న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.