నార్త్ లో ‘కింగ్డమ్’ రిలీజ్ పై ఫైనల్ గా ఓ క్లారిటీ!

నార్త్ లో ‘కింగ్డమ్’ రిలీజ్ పై ఫైనల్ గా ఓ క్లారిటీ!

Published on Jul 15, 2025 8:00 PM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కంప్లీట్ సర్ప్రైజింగ్ యాక్షన్ చిత్రం “కింగ్డమ్”. అంతకంతకు మంచి హైప్ ని సెట్ చేసుకుంటూ వెళుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మధ్య వచ్చిన అనౌన్స్మెంట్ లో కింగ్డమ్ హిందీ రిలీజ్ లేకపోవడం ఒకింత షాక్ కి గురి చేసింది.

కేవలం తెలుగు, తమిళ్ లో మాత్రమే అనౌన్స్ చేయడంతో హిందీ థియేట్రికల్ రిలీజ్ లేదనే అనుకున్నారు. కానీ దీనిపై నిర్మాత నాగవంశీ అసలు క్లారిటీ ఇచ్చారు. కింగ్డమ్ టైటిల్ కి సంబంధించి ఉన్న కొన్ని ఇష్యూస్ వల్లే మొన్న హిందీ అనౌన్సమెంట్ రాలేదని క్లారిటీ ఇచ్చారు. అంతే తప్ప హిందీ రిలీజ్ ఆగలేదని దీనిపై కొత్త టైటిల్ తో త్వరలోనే క్లారిటీ ఇస్తామని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు