అమీర్ ఖాన్‌తో లోకేష్ కనగరాజ్ చిత్రం.. సూపర్ హీరో కథతో గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్!

అమీర్ ఖాన్‌తో లోకేష్ కనగరాజ్ చిత్రం.. సూపర్ హీరో కథతో గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్!

Published on Jul 16, 2025 3:00 AM IST

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ మరో నెల రోజుల్లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ కనగరాజ్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు.

ఈ క్రమంలోనే లోకేష్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుందని.. ఈ పాత్రకు సంబంధించి ఎలాంటి విషయాలను ముందుగా రివీల్ చేయడం లేదని అందుకే ఈ సినిమాలోని ఆయన పాత్రను ఎక్కువగా వివరించడం లేదని తెలిపారు. ఇక అమీర్ ఖాన్‌తో త్వరలో తాను ఓ సినిమా చేయబోతున్నానని.. ఇదొక సూపర్ హీరో కథగా ఉండబోతుందని ఆయన తెలిపారు.

కేవలం ఇండియన్ ఫ్యాన్స్‌ను మాత్రమే కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసే కథగా ఇది రాబోతుందని ఆయన అన్నారు. దీంతో అమీర్ ఖాన్‌తో లోకేష్ ఎలాంటి సినిమాను చేస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు