‘కింగ్డమ్’ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అన్నాదమ్ముల ఎమోషనల్ బాండింగ్!

‘కింగ్డమ్’ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అన్నాదమ్ముల ఎమోషనల్ బాండింగ్!

Published on Jul 15, 2025 8:57 PM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా వస్తుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.

ఇక ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ సాంగ్‌గా ‘అన్న అంటేనే’ అనే సెంటిమెంటల్ పాటను జూలై 16న రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అన్నగా విలక్షణ నటుడు సత్యదేవ్ నటిస్తున్నాడు. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసి పాడాడు.

ఈ సినిమాలో బ్రదర్ సెంటిమెంట్ సినిమాకు ప్రధాన బలంగా మారనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 31న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు