మన ఇండియన్ ఓటిటి దగ్గర సూపర్ హిట్ అయ్యిన పలు వెబ్ సిరీస్ లలో అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకొచ్చిన సెన్సేషనల్ హిట్ సిరీస్ లలో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కూడా ఒకటి. అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకొచ్చిన ఈ సిరీస్ లో రెండు సీజన్స్ ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఇక దీని నుంచి మూడో సీజన్ ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉంది.
రేపు నవంబర్ 1 నుంచే పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్న ఈ సిరీస్ రిలీజ్ కి ముందు ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. దీనితో ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్ గా రానున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. అలాగే ఈ ప్రతీ ఎపిసోడ్ 40 నిమిషాలకి పైగానే ఉంటూ గంట లోపు ఉండే అవకాశం ఉందట. సో ఈ సిరీస్ ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. ఇక ఈ సీజన్ లో మనోజ్ బాజ్ పాయి అలాగే ప్రియమణి తదితరులు నటించగా రాజ్ అండ్ డీకే లు దర్శకత్వం వహించారు.


