స్టైల్ అండ్ స్వాగ్‌తో సాలిడ్ అప్డేట్ ఇవ్వనున్న ‘రాజాసాబ్’

స్టైల్ అండ్ స్వాగ్‌తో సాలిడ్ అప్డేట్ ఇవ్వనున్న ‘రాజాసాబ్’

Published on Nov 20, 2025 7:03 PM IST

The-Raja-Saab
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాజాసాబ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌ను ఇకనుండి కంటిన్యూగా చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో స్టైల్, స్వాగ్‌తో ఎంట్రీ ఇచ్చేందుకు రెబెల్ సాబ్ సిద్ధమయ్యాడు అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ స్పెషల్ పోస్టర్‌తో చిత్రబృందం ఫస్ట్ సింగిల్ వివరాలను ప్రకటించబోతోందని తెలియజేసింది. రేపు(నవంబర్ 21) మధ్యాహ్నం 12 గంటలకు తొలి పాటకు సంబంధించిన అప్‌డేట్ రానున్నట్టు పేర్కొన్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేశారు. ఇక సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు