NC24 టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేది ఆ స్పెషల్ రోజునే!

NC24 టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేది ఆ స్పెషల్ రోజునే!

Published on Nov 20, 2025 6:23 PM IST

యువ సామ్రాట్ నాగ చైతన్య తొలిసారి మిస్టికల్ థ్రిల్లర్ జానర్‌లో నటిస్తున్న చిత్రం #NC24 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని భారీ స్కేల్‌తో రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు SVCC, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు బివి‌ఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మాతలు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి బీటీఎస్ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో పెద్ద ఎత్తున నిర్మించిన సెట్‌, నెలల పాటు వందలాది టెక్నీషియన్ల కృషి వీడియోలో కనిపించాయి. అదే విధంగా నాగ చైతన్య ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జుజీ మాస్టర్ వద్ద తీసుకున్న కఠినమైన యాక్షన్ ట్రైనింగ్, ఆయన లుక్‌లో వచ్చిన మార్పు పాత్ర ఎంత ఇన్‌టెన్స్‌గా ఉంటుందో తెలియజేస్తుంది.

నవంబర్ 23న నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు