సెన్సార్ పనులు ముగించుకున్న ‘ఓ భామ అయ్యో రామ’

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఓ ‘భామ అయ్యో రామ’ జూలై 11న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను రామ్ గోధల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందించారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో తాము ఈ చిత్ర విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని మేకర్స్ తెలిపారు.

ఈ సినిమాలో మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రధాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

Exit mobile version