బాల్య నటునిగా ఎన్నో చిత్రాల్లో కనిపించిన నటుడు మాస్టర్ తేజ సజ్జ ఇప్పుడు హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే “ఓ బేబీ” చిత్రంలో నటించి ఆకట్టుకున్న ఈ యువ హీరో ఇప్పుడు జాంబీ రెడ్డి తో పాటుగా మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు. మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్న మూవీ నుండి హీరో తేజ లుక్ రిలీజైంది. ఈ రోజు తేజ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి అతని లుక్ ను రివీల్ చేసారు .
శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫాంటసీ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ:‘‘మా మహతేజ క్రియేషన్స్ బ్యానర్ మీద ‘‘ఎస్ ఒరిజనల్స్” తో కలిసి ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది అని తెలిపారు..
డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథకు అందరం కనెక్ట్ అయ్యాం..ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. మూవీ చాలా బాగా వచ్చింది. తేజ,శివానీ రాజశేఖర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు..షూటింగ్ అంతా కంప్లీట్ అయింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం” అని తెలిపారు.
ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు విషయానికి వస్తే కథ : ప్రశాంత్ వర్మ, డైలాగ్స్: లక్ష్మీ భూపాల, మ్యూజిక్: రథన్, సినిమాటోగ్రఫీ: విద్యా సాగర్, ఎడిటర్ : గ్యారీ బి.హెచ్, సాహిత్యం : కృష్ణ కాంత్, కాస్ట్యూమ్స్: సంతోషి రామ్ లు చేస్తుండగా ఈ చిత్రానికి చంద్ర శేఖర్ మొగుల్ల,సృజన్ యరబోలు లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.