రీసెంట్ గా పాన్ ఇండియా ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చిన చిత్రాల్లో భారీ యాక్షన్ మల్టీస్టారర్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా ఊహించిన రేంజ్ లో అయితే సాలిడ్ హిట్ కాలేదు. అయినప్పటికీ డీసెంట్ రన్ ని మాత్రం కొనసాగిస్తుంది.
ఇలా హిందీ మార్కెట్ వసూళ్లు చూసుకున్నట్టయితే నిన్న శుక్రవారం 3.5 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా బాలీవుడ్ పి ఆర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దీనితో వార్ 2 ఇన్ని రోజులు కలిపి 158 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక నేడు రేపు వీకెండ్ కావడంతో ఇక్కడ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. సో వార్ 2 ఇప్పుడు ఎంత రాబడుతుందో చూడాలి.