OG మాసివ్ రెస్పాన్స్.. ఏకంగా 500K లైకులతో ఫైర్‌స్టోర్మ్

OG మాసివ్ రెస్పాన్స్.. ఏకంగా 500K లైకులతో ఫైర్‌స్టోర్మ్

Published on Aug 2, 2025 10:33 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఓజి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా మేకర్స్ రూపొందిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘ఫైర్ స్టోర్మ్’ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ఆద్యంతం పవర్‌ఫుల్‌గా ఉండటం.. ఇందులో పవన్ పాత్రను ఎలివేట్ చేసిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో అభిమానులకు ఈ పాట ఎక్కేసింది. ఇక ఈ పాటను వారు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.

అంతేగాక, ఈ పాటకు యూట్యూబ్‌లో 6 గంటల్లోనే ఏకంగా 500K కి పైగా లైకులు రావడం విశేషం. దీంతో ఈ పాట ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సాలిడ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు