ఎన్టీఆర్-నీల్ కూడా అక్కడికేనా..?

JrNTR-Neel

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ షూట్ కోసం రెడీ అవుతోంది. ఈ నెల చివరి వారం షూట్‌ తిరిగి ప్రారంభమవుతుందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.

కాగా, తమ నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఆఫ్రికాలో లొకేషన్ హంట్‌లో ఉన్నారు. అక్కడ కొన్ని ఆసక్తికర సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారట చిత్ర యూనిట్. కాగా, నవంబర్ రెండో వారం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం 2026 జూన్‌లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది.

Exit mobile version