కన్నడ సినిమా నుంచి ఈ ఏడాది రిలీజ్ కి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన డివోషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కాంతార చాప్టర్ 1 కూడా ఒకటి. మరి ఈ సినిమా స్టడీ పెర్ఫార్మన్స్ ని బాక్సాఫీస్ వద్ద చూపిస్తూ ఇప్పుడు ఏకంగా 800 కోట్ల మార్క్ ని దాటేసింది. ఇక హిందీ మార్కెట్ లో కూడా స్టడీగా కాంతార కొనసాగుతూ ఉండడం విశేషం.
ఇలా సెన్సేషనల్ మార్క్ 200 కోట్ల నెట్ వసూళ్ల దగ్గరకి కాంతార ఇప్పుడు చేరుకుంటుంది. నిన్న శుక్రవారం వసూళ్ళతో ఈ సినిమా 197 కోట్ల నెట్ మార్క్ కి చేరుకోగా నెక్స్ట్ స్టాప్ గా ఈ శనివారం వసూళ్లతో డెఫినెట్ గా 200 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి మాత్రం ఈ సినిమాలో మంచి ఆదరణను అందుకుంది అని చెప్పొచ్చు.
