గత కొన్నాళ్ల కితమే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణ్ సినిమాల పరంగా పని చేసే పని గంటల పరంగా చేసిన కామెంట్స్ నేషనల్ వైడ్ గా ఎలా వైరల్ అయ్యాయి అనేది అందరికీ తెలిసిందే. భారీ సినిమాల నుంచి ఈ కండిషన్స్ మూలానే ఆమెని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కానీ ఆమె వెర్షన్ అలా ఉంటే నేషనల్ క్రష్ నయా పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మాత్రం అలాంటి కండిషన్స్ పెట్టకుండా సినిమా అంటే ఫ్యాషన్ తో ఎన్ని గంటలు అయినా వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉంది అని నిర్మాత ఎస్ కె ఎన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనితో వర్క్ పరంగా కండిషన్స్ పెట్టే దీపికా లాంటి హీరోయిన్స్ ఉంటే రష్మిక లాంటి సమాధానం ఇచ్చే హీరోయిన్స్ కూడా ఉంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
