‘కాంతార చాప్టర్ 1’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?

Kantara Chapter 1

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ ఈ ఏడాది ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధిస్తూ చరిత్ర సృష్టించింది. హిందీ, కన్నడ మార్కెట్లో సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర స్టడీగా ప్రదర్శితమవుతోంది.

ప్రైమ్ వీడియో ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకుంది. హిందీ వెర్షన్ థియేటర్స్ విడుదలైన తర్వాత ఎనిమిది వారాల అనంతరం స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశం ఉంది. అంటే నవంబర్ చివరి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇతర భాషా వెర్షన్లలో అక్టోబర్ చివరి వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

సినిమా ఇప్పటికీ థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న తరుణంలో నిర్మాతలు డిజిటల్ ప్రీమియర్‌ను ముందుగా వేస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా హొంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version