సెన్సార్ పూర్తి చేసేసుకున్న ‘మాస్ జాతర’.. ఇక జాతరే

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న అవైటెడ్ మాస్ చిత్రమే మాస్ జాతర. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ సినిమా రవితేజకి మంచి కం బ్యాక్ గా నిలవాలి అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఆల్రెడీ ట్రైలర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసేసుకుంది.

మరి సెన్సార్ పనులు అయ్యాక ఈ సినిమా యూ / ఏ సర్టిఫికెట్ ని పొందినట్లు మేకర్స్ రివీల్ చేశారు. సో ఇక థియేటర్స్ లో మాస్ ఆడియెన్స్ కి జాతరే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు అలాగే శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version