ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ఒక క్రికెటర్ గా కంటే కూడా అదిరిపై ఎంటర్టైనర్ గా మన ఇండియన్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మధ్య డౌన్ సమయంలో టిక్ టాక్ పుణ్యమాని టాలీవుడ్ ఆడియెన్స్ నుంచి భారీ గా రెస్పాన్స్ తెచ్చుకున్న వార్నర్ ఆ మధ్య అంతా మంచి రచ్చ చేసేసాడు.
మన దగ్గర అయితే పలువురు స్టార్ హీరోస్ వీడియోస్ చేసిన వార్నర్ ఇప్పుడు ఇళయ థలపతి విజయ్ పై ఓ వీడియోని చేసి వదిలాడు. విజయ్ సర్కార్ నుంచి లేటెస్ట్ “మాస్టర్” వరకు తన రీపేస్ వీడియో చేసి వదిలాడు. దీనితో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేనికదే కానీ వార్నర్ మాత్రం ఏ హీరో వీడియో చేసిన భలే సూట్ అయ్యిపోతున్నాడని చెప్పాలి. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడనట్టు అయితే ఈ కింద ఉంది చూసెయ్యండి.