ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వింటేజ్ వండర్ ఫుల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. పాన్ ఇండియన్ లెవెల్లో మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ భారీ చిత్రం టీజర్ కోసమే ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే మేకర్స్ కొన్ని రోజుల కితమే ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ను వచ్చే ఫిబ్రవరి 14న లవర్స్ డే కానుకగా విడుదల చేస్తున్నామని ప్రకటించారు.
మరి ఈ అప్డేట్ తర్వాత మరో అసలైన అప్డేట్ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. అదే ఈ టీజర్ ఏ టైం కు తీసుకు వస్తారో అన్నది. మరి దానిని కూడా ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చెయ్యనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ టీజర్ ను ఎప్పుడు ఏ టైం కు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి మొత్తం ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.