భారీ బడ్జెట్ తో ‘గబ్బర్ సింగ్’, ‘బాద్ షా’, ‘ఇద్దరమ్మాయిలతో’ లాంటి చిత్రాలను నిర్మించి సూపర్ హిట్స్ అందుకున్న నిర్మాత బండ్ల గణేష్. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘గోవిందుడు అందరివాడెలే’ అనే సినిమాని నిర్మిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా మీడియాలో బండ్ల గణేష్ త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా బండ్ల గణేష్ ఈ వార్తలు అన్ని వట్టి పుకార్లేనని క్లియర్ చేసారు.
‘నాకు పాలిటిక్స్ అంటే తెలియదు, అలాగే నాకు పాలిటిక్స్ అంటే అస్సలు ఆసక్తి లేదు. నాకు సినిమా సినిమా అంటేనే ఇష్టం, సినిమాల్లోనే ఉంటానని’ ట్వీట్ చేసాడు.
ప్రస్తుతం సినీ హీరోలైన చిరంజీవి కాంగ్రెస్ వైపు, బాలకృష్ణ టిడిపి వైపు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వైపు ప్రచారం చేస్తున్నారు. మరో వైపు కొంతమంది సెలబ్రిటీస్ ఎవరి వైపు మొగ్గు చూపాలో తెలియక న్యూట్రల్ గా ఉన్నారు.