అనుష్క మిగతా హీరోయిన్లలా కాకుండా చాలా నిందానంగా సినిమాలు చేస్తున్నారు. బోలెడంత మార్కెట్ ఉన్నప్పటికీ ఆమె ఏమాత్రం తొందరపడట్లేదు. చేసేది లేడీ ఓరియెంటెడ్ సినిమాలే అయినా వాటిలోనూ సెలెక్టెడ్ సినిమాలను చూసుకుంటున్నారు. ఆమె గత చిత్రం ‘భాగమతి’ మంచి ఫలితాన్నే అందుకున్నా ఓటీటీలో వచ్చిన ‘నిశ్శబ్దం’ తేడా కొట్టేసింది. అప్పటి నుండి స్వీటీ నుండి కొత్త అప్డేట్ ఏదీ అధికారికంగా రాలేదు. కానీ ఆమె ఈమధ్యనే ఇక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొచ్చాయి.
ఆరా తీయగా అవి నిజమేనని తేలింది. ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. ఇందులో నవీన్ పోలిశెట్టి కీ రోల్ చేయనున్నారు. అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం తెలియట్లేదు. అసలు నిర్మాణ సంస్థకే ఇంకా పూర్తి క్లారిటీ లేదట ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో. అనుష్క సినిమాకు ఓకే చెప్పినా ఇంకా డేట్స్ కేటాయించలేదట. అందుకే ఈ ఆలస్యం అంటున్నారు. ఒకసారి ఆమె నుండి స్పష్టత వచ్చాకే సినిమాను అధికారికంగా ప్రకటిస్తారట. మొత్తానికి చూడబోతే అనుష్క అభిమానులకు ఇంకొన్ని రోజులు ఎదురుచూపులు తప్పేలా లేవు.