నిర్విరామంగా “సర్కారు వారి పాట”.!

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ ఫ్లిక్ “సర్కారు వారి పాట”. మరో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కు ఈ సినిమా ఆరంభం కావాలని మహేష్ ఫ్యాన్స్ దీనిపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి దీనికి సంబంధించి కూడా దర్శకుడు ఎక్కడా ఎలాంటి లేట్ చెయ్యడం లేదు.

పక్కా ప్రణాళిక ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న దుబాయ్ షెడ్యూల్ జరిగిపోతుందట. ఎక్కడా అసలు గ్యాప్ లేకుండా నిర్విరామంగా ఈ సినిమా షూట్ జరుగుతుందట. తెల్లవారు జాము నుంచే చిత్ర యూనిట్ షూటింగ్ నిమిత్తం పరుగులు తీస్తుంది. మరి దీనితో పరశురామ్ ఎంత పర్ఫెక్ట్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తూ వెళ్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version