తమిళ్, మలయాళ హీరోలు నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయి ఒక సినిమా విజయం సాధిస్తే దాని వెనుక మరో నాలుగైదు సినిమాలు రావడం ఆనవాయితీ. అదే తరహాలో నిత్య మీనన్ మలయాళంలో నటించిన సినిమాలు కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. నిత్యా మీనన్ ఇటీవలే నటించిన ‘ఇష్క్’ చిత్రం విడుదలై మంచి సక్సెస్ సాధించి 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే నిత్యా తెలుగులో నటించిన ‘అలా మొదలైంది’ మరియు ‘ఇష్క్’ రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో ఆమె మలయాళంలో నటించిన సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. ఆమె నటించిన ‘అపూర్వ రాగం’ సినిమాని తెలుగులో ‘50% లవ్’ పేరుతో, ‘వయోలిన్’ సినిమాని ‘దిల్ సే’ పేరుతో, ‘కర్మయోగి’ సినిమాని అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు.